నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: ఇటీవలే టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మంగళవారం విడుదల చేసిన నాలుగో జాబితాలో చలమల్ల కృష్ణారెడ్డికి మునుగోడు భాజపా అభ్యర్థిగా టిక్కెట్ కేటాయించారు. భాజపా అభ్యర్థిగా టిక్కెట్ కేటాయించిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా గారికి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నా గెలుపు కోసం మునుగోడులో భాజపా శక్తి కేంద్రాల ఇన్చార్జులు భాజపా కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలని చలమల్ల కృష్ణారెడ్డి తెలిపారు.