గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

– ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
– గాంధీజీ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు 
నవతెలంగాణ – చండూర్
చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని వాటర్ ట్యాంక్ చౌరస్తా వద్ద గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బుధవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాంధీజీ ఫౌండేషన్ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియం చేసుకోవాలని సూచించారు. ఎండలు ఎక్కువ ఉన్నందున చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆకలి వేస్తే అన్నం, దాహం వేస్తే నీరు, ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ మాట్లాడుతూ డాక్టర్ కోడి శ్రీనివాసులకు ఇలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రతి నెల 20 మంది నిరుపేదలకు నిత్యవసర సరుకులు  అందిస్తూనే, సమాజ అవసరాల మేరకు మంచి కార్యక్రమాలు చేపడుతున్న గాంధీజీ ఫౌండేషన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో భూతరాజు వేణు, గజ్జల కృష్ణారెడ్డి, భీమనపల్లి శేఖర్, బ్రహ్మం, ఐతరాజు మల్లేష్, నలపరాజు సతీష్,  శిరంశెట్టి శ్రీధర్ బాబు, చిట్టిపోలు మహేష్, మందడి శంకర్ రెడ్డి ,బోడ వెంకటేశం, జానయ్య, ముజ్జు, చెరిపెల్లి సాయి, జూలూరు వెంకటేశం, తిరందాసు నందు, సాదక్, సరికొండ వెంకన్న, బుషిపాక యాదగిరి, సైదులు, పాలకూరి కిరణ్, నల్ల సత్యం, అక్బర్, కారింగు రవి, భూతరాజు శ్రీకాంత్, రావిరాల రాజు, అమృతం తదితరులు పాల్గొన్నారు.
Spread the love