రేపు బండి సంజయ్ నామినేషన్..

నవతెలంగాణ – బెజ్జంకి
రేపు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారని, మండలంలోని బీజేపీ శ్రేణులు హజరై విజయవంత చేయాలని, బుధవారం బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి కోరారు. దాచారంలో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో నామినేషన్ పర్వానికి బీజేపీ శ్రేణుల తరలింపుపై బీజేపీ మండలాధ్యక్షుడు కొలిపాక రాజు సమీక్ష నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి అనిల్ రావ్, బీజేపీ మండల నాయకులు కచ్చు సంపత్ పాల్గొన్నారు.
Spread the love