ప్రజలు సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే కవ్వంపల్లి

నవతెలంగాణ – బెజ్జంకి 
పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో  ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అకాక్షించరు. మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవ వేడుకకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజుల ఆరాధ్యదైవమైన పెద్దమ్మతల్లి దీవెనలతో ముదిరాజుల ఆర్థికం,పాడి పంటలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నారు.అనంతరం కాంగ్రెస్ నాయకుడు చెప్యాల శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
ధరణితో దగపడ్డామని అవేదన..
మండలంలోని చీలాపూర్ గ్రామానికి చెందిన కొందరు దళితులు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో దగపడ్డామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వద్ద అవేదన వ్యక్తం చేశారు. సర్వేనంబర్118,164 యందు భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు సుమారు 40 ఏండ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని పంపిణీ చేసి పట్టా పుస్తకాలు అందజేసిందని..నాటి నుండి నేటి వరకు లబ్ధిదారులందరం సాగు చేసుకుంటున్నామని ఎమ్మెల్యేకు తెలిపారు.గతంలో పట్టా పాసు పుస్తకాలు ఉన్నప్పటికి ధరణితో ఆన్లైన్ యందు పట్టాదారు  పేర్లు చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగేల ప్రత్యేక శ్రద్ద చూపి పాస్ పుస్తకాలు ఇప్పించాలని బాధిత లబ్దిదారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో దామోదర్,రత్నాకర్ రెడ్డి,శానగొండ శరత్,తదితరులు అయన వెంట ఉన్నారు.
Spread the love