దరఖాస్తుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించాలి

– ఏఐవైఎఫ్ మండలాధ్యక్షుడు మహేశ్ డిమాండ్
నవతెలంగాణ – బెజ్జంకి 
ప్రజల నుండి ప్రభుత్వం స్వీకరించిన ఆరు గ్యారెంటీల దరఖాస్తుల్లో మార్పులు,చేర్పులకు అవకాశం కల్పించాలని ఏఐవైఎఫ్ మండలాధ్యక్షుడు దొంతరవేణి మహేశ్ డిమాండ్ చేశారు.శనివారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మహేశ్ మాట్లాడారు.రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ప్రజల నుండి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించడం అభినందనీయమన్నారు.ఆరు గ్యారెంటీల దరఖాస్తులో ప్రజలు నమోదు చేయాల్సిన వివరాలపై సరైన అవగాహన లేకా అధికారులిచ్చిన తప్పుడు సూచనలు,దరఖాస్తుల్లోని వివరాల నమోదులో అధికారుల అత్యుత్సహం, ఆపరేటర్ల నిర్లక్ష్యం వల్ల అర్హులైన ప్రజలకు ఆరు గ్యారెంటీల్లో అన్యాయం జరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు అభాసుపాలవుతున్నాయన్నారు.ప్రజలు సమర్పించిన ఆరు గ్యారెంటీల దరఖాస్తుల్లో అర్హులకు న్యాయం చేకూర్చేల ప్రభుత్వం మళ్లీ మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు కట్కూరి నరేష్,లడే నరేష్,అంతటి సురేష్ పాల్గొన్నారు.
Spread the love