చలో సంక్షేమ భవనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

– ఆర్ వాసుదేవ రెడ్డి టీఎస్ యుటిఎఫ్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట : ఈనెల నాలుగో తేదీన టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తలపెట్టిన చలో సంక్షేమ భవనం కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం కోర్ర రఘురాం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వాసుదేవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రమోషన్స్, బ దిలీలు మరియు  రెగ్యులర్  ఉపాధ్యాయులు లేక విద్య వ్యవస్థ కుంటుపడుచున్నది. అందువల్ల గిరిజన సంక్షేమ శాఖలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బదిలీలు మరియు ప్రమోషన్లు నిర్వహించాలని  రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని కోరడమైందని అన్నారు. ఈనెల 4వ తేదీన చలో సంక్షేమ భవనం కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులు సంఘ బాధ్యులు కార్యకర్తలు మండల అధ్యక్షత, ప్రధాన కార్యదర్శి మొదలగువారు పాల్గొని విజయవంతం చేయాలని  కోరుచున్నాము అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఈ లక్ష్మీనారాయణ కోర్ర రఘురాం, వంగ పాపయ్య, లావుడియా దసురు, ఎస్. రాజు సదర్ లాల్.  మరియు మంకిడి నర్సింగరావు మొదలగు వారు పాల్గొన్నారు.
Spread the love