చాంప్‌ సికింద్రాబాద్‌ క్లబ్‌

Champ Secunderabad Club– ఇంటర్‌ క్లబ్‌ టీ20 టోర్నమెంట్‌
హైదరాబాద్‌ : ఇంటర్‌ క్లబ్‌ టీ20 టోర్నమెంట్‌ చాంపియన్‌గా సికింద్రాబాద్‌ క్లబ్‌ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫతేమైదాన్‌ క్లబ్‌పై ఘన విజయం సాధించిన సికింద్రాబాద్‌ క్లబ్‌ 10 ఏండ్ల తర్వాత మళ్లీ టైటిల్‌ గెల్చుకుంది. ఫతేమైదాన్‌ క్లబ్‌ తొలుత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. రాహుల్‌ బుద్ది (76 నాటౌట్‌) అర్థ సెంచరీ సాధించగా.. అక్షత్‌ బద్రుక (3/22) మూడు వికెట్లతో మెరిశాడు. సంజీవ్‌ రెడ్డి (57), చరణ్‌ (84), సివి ఆనంద్‌ (7 నాటౌట్‌) రాణించటంతో 14.5 ఓవర్లలోనే సికింద్రాబాద్‌ క్లబ్‌ 164 పరుగులు చేసింది. హైదరాబాద్‌ సీపీ సివి ఆనంద్‌ సారథ్యంలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Spread the love