చాంపియన్‌ పంజాబ్‌

మొహాలి : దేశవాళీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ చాంపియన్‌గా పంజాబ్‌ నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో బరోడాపై 20 పరుగుల తేడాతో ఆ జట్టు గెలుపొందింది. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (113, 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు), నెహల్‌ వదేరా (61 నాటౌట్‌ ) ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో తొలుత పంజాబ్‌ 223/4 పరుగులు చేసింది. ఛేదనలో అభిమన్యు (61), నినద్‌ (47), కృనాల్‌ పాండ్య (45) మెరిసినా బరోడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 203 పరుగులే చేసింది.

Spread the love