కూటమి పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం

నవతెలంగాణ అమరావతి: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశం విజయవాడ ఏ కన్వెన్షన్‌లో ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా వారందరూ ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్‌కల్యాణ్‌ ప్రతిపాదించగా.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం పలకనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Spread the love