Tuesday, July 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహసీనాపై అభియోగాలు నమోదు

హసీనాపై అభియోగాలు నమోదు

- Advertisement -

ఢాకా : పదవీచ్యుతురాలైన మాజీ ప్రధాని షేక్‌ హసీనా, మరో 40 మందిపై బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌ (ఐసీటీ)లో సోమవారం అభియోగాలు నమోదు చేశారు. 2013లో ఢాకాలో జరిగిన ర్యాలీ సందర్భంగా పోలీసుల అణచివేత చర్యలకు సంబంధించి ప్రాసిక్యూషన్‌ ఈ అభియోగాలు మోపింది. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ హెఫజత్‌-ఎ-ఇస్లాం నిర్వహించిన నిరసన ప్రదర్శనపై పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఐసీటీ రిజిస్ట్రార్‌కు సోమవారం ఆరోపణలను సమర్పిం చారు. అప్పటి ఆర్మీ చీఫ్‌, రాజకీయ నేతలు, భద్రతాధి కారులకు ట్రిబ్యునల్‌ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ కేసులో మాజీ మంత్రులు, సీనియర్‌ పోలీస్‌ అధి కారులు, పాత్రికేయులు సహా తొమ్మిది మంది నిందితులు ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. 2024లో జరిగిన విద్యార్థుల నిరసనలపై ఉక్కు పాదం మోపి నందుకు హసీ నాకు ఇదే ట్రిబ్యునల్‌ గత సంవత్సరం నవంబరులో మరణశిక్ష విధించింది. అయితే ఆమె 2024 ఆగస్ట్‌ ఐదో తేదీన భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి అక్కడే నిసిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -