పెట్టుబడిదారీ వ్యవస్థపై అమెరికన్లలో అసంతృప్తి
పలువురు రిపబ్లికన్లదీ అదే మాట
అది ధనవంతులకే అనుకూలమంటున్న ప్రజలు
వాషింగ్టన్ : డెమొక్రాట్లను ‘సోషలిస్టులు’…ఇంకా చెప్పాలంటే ‘కమ్యూనిస్టులు’ అని పిలవడమే మధ్యంతర ఎన్ని కలకు తన ప్రధాన వ్యూహమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అమెరికా రాజకీయాలలో కనిపి స్తున్న దృశ్యం ఏమిటంటే సోషలిజం ఉద్ధానం కంటే పెట్టుబడిదారీ విధానం, ఆర్థిక సమానత్వంపై విశ్వాసం సడలడమే. ఇటీవల దేశంలో నిర్వహించిన వివిధ పోల్స్ ఈ వాదనను బలపరుస్తున్నాయి. ఇటీవల ఫాక్స్ న్యూస్ నిర్వహించిన పోల్ ముఖ్యమైన విషయాలలో గత సంవత్సరపు గ్యాలప్ డేటాతో ఏకీభవి స్తోంది. సోషలిజంపై ప్రజలలో సదభిప్రాయం ఏర్పడుతున్నప్పటికీ పెట్టుబడిదారీ విధానంపై మాత్రం వారిలో విశ్వాసం పెద్ద ఎత్తున సడలిపోతోందని ఈ పోల్స్ చెబుతున్నాయి.
రిపబ్లికన్లలోనూ…
పెట్టుబడిదారీ విధానంపై 2019లో 30 పాయింట్ల (నమోదైన ఓటర్లలో 57 శాతం అనుకూలత వ్యక్తం చేయగా 27 శాతం మంది వ్యతిరేకించారు) సానుకూలత కనిపిం చగా ప్రస్తుతం అది నాలుగు పాయింట్లకు పడిపోయింది. ప్రస్తుతం ఈ విధానాన్ని 50 శాతం మంది సమర్ధిస్తుంటే 46 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ధనవంతులకు అనుకూలంగా ఉండే లా రూపొందించబడిందని 65 శాతం మంది చెప్పారు. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ఇది 56 శాతంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన ఆశ్చర్య కరమైన విషయమేమింటే రిపబ్లికన్లు సైతం పెట్టుబడిదారీ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పో తున్నారు. 2019లో 72 శాతం మంది రిపబ్లి కన్లు ఈ వ్యవస్థపై నమ్మకాన్ని కలిగి ఉంటే ఇప్పుడది 61 శాతానికి పడిపోయింది. అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థపై బలమైన సానుకూల దృక్పథం కలిగిన వారి సంఖ్య కూడా 54 శాతం నుంచి 41 శాతానికి తగ్గింది.
ధనవంతులు పన్నులు చెల్లించరా?
పెట్టుబడిదారీ వ్యవస్థ ధనవంతులకు అనుకూలంగా ఉండేలా రూపొందిందఁ చెప్పే రిపబ్లికన్ల సంఖ్య 2018లో 30 శాతం ఉంటే ఇప్పుడు 42 శాతానికి పెరిగింది. స్వేచ్ఛా మార్కెట్లకు అనుకూలమని చెప్పుకునే రిపబ్లికన్లలో కూడా ఇప్పుడు సగం కంటే తక్కువ మంది మాత్రమే పెట్టుబడిదారీ వ్యవస్థపై గట్టి సానుకూల దృక్పథంతో ఉన్నారు. గత నెలలో వాల్ స్ట్రీట్ జర్నల్-నాక్ నిర్వహించిన పోల్ ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థ కొంతవరకైనా బాగా పనిచేస్తోందని చెప్పే అమెరికన్ల సంఖ్య దశాబ్దం క్రితం 60 శాతం ఉండగా ఇప్పుడది తగ్గింది. జనవరిలో ప్యూ రిసెర్చ్ సెంటర్ ఓ పోల్‌ను నిర్వహించింది. ధనవంతులు పన్నుల రూపంలో తమ న్యాయమైన వాటాను చెల్లించకపోవడం చాలా కలవరపెడుతోందని 61 శాతం మంది అమెరికన్లు చెప్పారు. వీరిలో 41 శాతం మంది రిపబ్లికన్లు, స్వతంత్రులే.
బడా వ్యాపార సంస్థలపై ప్రతికూలత
గ్యాలప్ డేటా ప్రకారం బడా వ్యాపార సంస్థల పట్ల అమెరికాలో సానుకూలత తగ్గిపోతోంది. 2012లో 19 పాయింట్ల సానుకూలత ఉంటే గత సంవత్సరం పాతిక పాయింట్ల ప్రతికూలత ఉండడం గమనార్హం. ఏదేమైనా అభ్యర్థులను సోషలిస్టులు, కమ్యూనిస్టులు అనివిమర్శించడం అనేది ట్రంప్ భావిస్తున్నట్టు సర్వరోగ నివారిణి కాకపోవచ్చునని తాజా పోల్స్ నిరూపిస్తున్నాయి.
నమ్మకం సడలుతోంది !
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



