అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది..

Charity is greater than all donations.నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని ప్రముఖ వైద్యులు డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ అన్నారు.గణేష్ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా  శుక్రవారం సూర్యాపేట పఠనం లోని చింతలచెరువులో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద పూజలు నిర్వహించరు. అనంతరం అన్నదానం కార్యక్రమం ఏర్పాటుచేసిన దాతల సమక్షంలో అన్నదాన వితరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానము గొప్పది అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 17 వార్డు లో వినాయక విగ్రహాము నెలకొల్పి పూజలు చేయడం ఎంతో విశేషం అని ఈనెల 16వ తేదీన నిమజ్జనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలనికమిటీ సభ్యులను కోరారు. అన్నదానం ఏర్పాటుచేసిన భైరబోయిన శ్రీనివాసు దంపతులకు  కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ  కార్యక్రమంలో జ్యోతి కరుణాకర్, తండు శ్రీనివాస్ గౌడ్,చల్ల  లక్ష్మీకాంత్,కమిటీ సభ్యులు భైరబోయిన సైదులు,శివరాత్రి నాగరాజు, బైరబోయిన మల్సూర్,పవన్, నరేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love