చెంపపెట్టు తీర్పు

Cheek judgmentకండ్ల ముందే మూడేండ్ల బిడ్డను బండరాయికి మోది చంపేశారు. కుటుంబంలో 14 మందిని పోగొట్టుకున్నారు. ఆమెపై పైశాచికంగా సామూహిక లైంగిక దాడికి పాల్ప డ్డారు.అయినా ఆ బాధంతా కడుపులో దాచుకుంది. నేర స్తులకు శిక్ష పడేంత వరకు పోరాడింది బిల్కిస్‌ బానో. చివ రకు ముంబై కోర్టు దోషులకు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును దేశమంతా హర్షించింది. ఇలాంటి నీచులను ఎవ రు మాత్రం క్షమించగలరు. కానీ బేటీ పఢావ్‌-బేటీ బచావ్‌ అంటూ నిత్యం జపించే బీజేపీ ప్రభుత్వం మాత్రం క్షమిం చాలని భావించింది. ఆ పార్టీ ఆధ్వర్యంలోని గుజరాత్‌ ప్రభు త్వం గత ఏడాది ఆజాదీ అమృత్‌ మహోత్సవాల సందర్భం గా ఆ నీచులకు క్షమాభిక్ష ప్రకటించింది. స్వేచ్ఛగా నేరాలు చేయమంటూ హారతులిచ్చి మరీ బయటకు వదిలేసింది బీజేపీ. దేశం నివ్వెరపోయింది. ఆ క్షమాభిక్షను కొట్టివేస్తూ తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గుజరాత్‌ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని మొట్టి కాయలు కూడా వేసింది.బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో 2002లో మత ఘర్షణలు చెలరేగాయి. అల్లరి మూకలు వేలమందిపై దా డులు చేశారు. మాటల్లో చెప్పలేని, అక్షరాల్లో రాయలేని దా రుణాలు చేశారు. ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టు కున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరిపైనా ఒక్క కేసూ కూడా లేదు. కొంతమంది పోరాటాల ఫలితంగా కొన్ని కేసులపై విచారణ జరిగింది. అలాంటి వాటిలో బిల్కిస్‌బానో కేసు ఒ కటి. వాస్తవానికి ఏ రాష్ట్రంలో నేరం జరిగితే అదే రాష్ట్రంలో విచారణ జరగాలి. కానీ బీజేపీ పాలిస్తున్న గుజరాత్‌ రాష్ట్రం లో బాధితులకు న్యాయం జరగదని భావించిన సుప్రీంకోర్టు కేసు విచారణను మహారాష్ట్ర కోర్టుకు అప్పగించింది. అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్‌ బానోతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై హిందూ అల్లరి మూక సామూహిక లైంగిక దాడికి పాల్పడి, 14 మందిని హత్య చేసింది. ఈ కేసుపై మహారాష్ట్ర కోర్టులో విచారణ జరిగింది. కోర్టు 11 మందికి జీవిత ఖైదు విధించింది. అ యితే ఆ అల్లర్ల సమయంలో అధికారంలో ఉన్న అదే బీజేపీ 2022లో ఆగస్టు 15న ఆ దుర్మార్గులకు క్షమాభిక్ష ప్రకటిం చింది. దీన్ని సవాలు చేస్తూ అనేక మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీరిలో బిల్కిస్‌బానో కూడా ఒకరు. వీట న్నింటినీ పరిశీలించిన సుప్రీం డివిజన్‌ బెంచ్‌ జస్టిస్‌ బి.వి. నాగరత్న, ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పా టు చేసింది. సోమవారం బెంచ్‌ కొన్ని కీలకమైన విషయా లను ప్రస్తావించి గొప్ప తీర్చు ఇచ్చింది. ఈ కేసులో గుజరాత్‌ ప్రభుత్వం ‘దోపిడీ దారులకు సహకరించింది’ అని పేర్కొంది. మహారాష్ట్ర కోర్టు శిక్ష విధిం చిన ఆ దోషులను ముందస్తుగా విడుదల చేసే అధికారం గుజరాత్‌ ప్రభుత్వానికి లేదని బల్లగుద్ది మరీ చెప్పింది. కానీ గుజరాత్‌ పాలకులు ఈ ప్రాధమిక సూత్రాన్ని కూడా పా టించలేదు. ఎంతటి నేరాలు చేసినా తమవారిని కాపాడుకో వాలని తపించే వారు నీతి సూత్రాలు పాటిస్తారనుకోవడం మన అత్యాశే అవుతుంది. దోషులలో ఒకడైన రాదేశ్యామ్‌ గుజరాత్‌ కోర్టుకు అం దించిన పిటిషన్‌లో ఉన్నవన్నీ అబద్ధాలే అని, వాస్తవాలను కప్పిపుచ్చి కోర్టును మోసం చేసి బెయిల్‌ పొందారని కూడా సుప్రీం బయట పెట్టింది. అలాగే ముందస్తు బెయిల్‌ ఇవ్వ డానికి గుజరాత్‌ ప్రభుత్వం అప్పట్లో చెప్పిన మరో కారణం దోషుల పశ్చాత్తాపం. అయితే ముంబై కోర్టు తీర్పు ఇచ్చే సమయంలో దోషులకు జైలు శిక్షతో పాటు జరిమానా కూ డా విధించింది. ఆ మొత్తాన్ని బిల్కిస్‌ బానోకు చెందాలని స్పష్టంగా చెప్పింది. కానీ ఇప్పటివరకు అది వారు కట్టలేదు. పైగా జైలు శిక్ష పడ్డప్పటి నుండి ఏడాదికి ఆరేడు నెలలు స్థానిక పోలీసులు, బీజేపీ నాయకుల సాయంతో రాజాల్లా బయటకు వస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిలో పశ్చాత్తాపం ఏ వైపు నుండి కనిపించిందో గుజరాత్‌ను పాలిస్తున్న బీజేపీ పాలకులకే ఎరుక. ఇక సుప్రీం చెప్పిన మరో విషయం ఈ కేసులో గుజరాత్‌ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అలాగే రూల్‌ ఆఫ్‌ లాను ఏమాత్రం పాటించలేదు. ఎంతోమంది చిన్న చిన్న నేరాలు చేసి ఏండ్లుగా జైళ్ళలో మగ్గుతున్నారు. నేరం రుజువు కాకుండానే శిక్ష అనుభవిస్తున్నారు. వారందరిపై లేని ప్రేమ అత్యంత నీచమైన, హే యమైన నేరం చేసిన వీరిపై ఎందుకో! అత్యు న్నత న్యాయస్థానం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో దోషులపై జాలి చూపించాల్సిన అవసరమే లేదని స్పష్టం చే సింది. దోషులను రెండు వారాల్లో లొంగిపొమ్మని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు నిజంగా హర్ష ణీయం. దోషులకు మద్దతు పలుకుతున్న వారికి చెంపపెట్టు. అయితే సుప్రీం వారికి రెండు వారా లు గడువిచ్చింది. ఈ లోపు తమ రాజకీయ బలా న్ని అడ్డుపెట్టుకొని తప్పించుకునే అవకాశం కూ డా లేకపోలేదు. గతంలో తీర్పు ఇచ్చిన మహా రాష్ట్రను ప్రస్తుతం పాలిస్తున్నది కూడా బీజేపీనే. కోర్టు చెప్పిన ప్రమాణాలను లక్షపెట్టకపోతే అక్కడి నుండి క్షమాభిక్ష తెచ్చుకోవడం వారికేం కష్టం కాదు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం..!

Spread the love