చేపూర్ గ్రామ కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – ఆర్మూర్

మండలం లోని చేపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక  9 కుల సంఘ సభ్యులతో నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నికలలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా అన్ని కులాల సంఘ సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా మేడిపల్లి శ్రీకాంత్ ఆదివాసి నాయకపోడు సంఘ సభ్యున్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా కుస్తాపురం  నడిపి నర్సారెడ్డి కోశాధికారిగా సురేష్ రుక్మాజి, ముఖ్య సలహాదారుడిగా బొబ్బిలి బొర్రన్న , ప్రధాన కార్యదర్శిగా కంపదండి వినోద్ గార్లను ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అధ్యక్షునిగా ఎన్నికైన మేడిపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి గురించి మా గ్రామ అభివృద్ధి కమిటీ కృషి చేస్తుంది అని గ్రామ బుద్ధి కమిటీ అంటే గ్రామ అభివృద్ధి గురించి పాటుపడతామని ఇలాంటి చట్ట  వ్యతిరేక కార్యక్రమాలు అనగా ఎవరికి కూడా జరిమానాలు గాని భూతగాదాలు గానీ కొట్లాట సమస్యలు గానీ జరిమానాలు కానీ తీయమని,  గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామ సమస్యలను ప్రభుత్వ అధికారుల వద్దకి, ప్రజా ప్రతినిధుల వద్దకి తీసుకువెళ్లి గ్రామ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని ఆయన అన్నారు. గ్రామ అభివృద్ధి పైన ప్రభుత్వ అధికారులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అధికారులు ప్రజాప్రతినిధులు మా గ్రామ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ కుల సంఘాల పెద్ద మనుషులు గ్రామ ప్రజలు గ్రామ యువకులు  పాల్గొన్నారు.
Spread the love