ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి: చెరుపల్లి సీతారాములు

నవతెలంగాణ – భువనగిరి
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నికల చుట్టూ తిరిగినా వెంటనే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేయాలని ప్రజా ప్రయోజనకర పథకాలను అమలు అయ్యే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. శనివారం సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను మర్చిపోయి ఎన్నికల చుట్టూ తిరిగి కాలయాపన చేసి ప్రస్తుతం ప్రజా సమస్యలను పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని వారు అన్నారు. అకాల వర్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వరి ధాన్యం నీట మునిగి ఆరుకాలం కష్టపడి పండించిన పంట నష్టం జరగడంతో రైతులు ఆవేదనకు గురి అవుతున్నారనానారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బోనస్ రూ.500 రూపాయలు ఇస్తామని చెప్పిన ఇప్పుడు ఇచ్చిన హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. అదేవిధంగా అనేకమంది రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని ప్రగల్బాలు పలికిన  కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర ప్రకటించి అదనంగా ఇచ్చిన హామీ రూ.500 రూపాయల బోనస్ ను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే రైతాంగం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని వారు అన్నారు. రైతుల, కార్మికుల, వ్యవసాయ కూలీల, విద్యార్థి యువజన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ పథకాల అమలు జరగకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని వారు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అనేక మార్కెట్ యార్డులలో వేల క్వింటాల ధాన్యం తడిసి రైతులు నెత్తికి చేతులు పెట్టుకొని ఆదుకునే వారు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నష్టపోయిన రైతాంగానికి ఎలాంటి హామీ రాకపోవడం రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.  జిల్లా వ్యాప్తంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతందానికి నష్టపరిహారం చెల్లించి బోనస్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వీరితోపాటు సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటూరు బాలరాజు, కల్లూరు మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, బబ్బురు పోశెట్టి, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేష్, మాయ కృష్ణ, దోడ యాదిరెడ్డి, పగిల్ల లింగారెడ్డి, బండారు నరసింహ, బొల్లు యాదగిరి, బోలగాని జయరాములు, గుండు వెంకటనర్సు, ఎంఏ ఇక్బాల్, గడ్డం వెంకటేష్, రాచకొండ రాములమ్మ, వనం ఉపేందర్, మండల కార్యదర్శిలు ధూపటి వెంకటేష్, పోతరాజు జహంగీర్, రేకల శ్రీశైలం, వేముల బిక్షం, బుర్రు అనిల్, నూకల భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
Spread the love