అన్ని రకాల వడ్లకి బోనస్ ఇవ్వాలి: కొత్తపల్లి శివకుమార్  

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రాష్ట్రంలో పండించిన అన్ని రకాల గుడ్లకు క్వింటాకు 500 బోనస్ ఇవ్వాల్సిందేనని  సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్  జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని విక్రమం భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం సన్న వడ్లకు మాత్రమే రూ.500 రూపాయలు బోనస్ ఇస్తా అని అనడం ఆశ్చర్యకరంగా ఉన్నదని అన్నారు. ఇప్పటికే అకాల వర్షాల వల్ల ఐకెపి సెంటర్లలో ఉన్న దాన్యం కొనడంలో జరిగిన ఆలస్యం వల్ల ధాన్యం తడిసి రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్క పైన తాటిపండు పడ్డట్లు రేవంత్ రెడ్డి రూ.500 ఇస్తానని అనటం  సరైన పద్ధతి కాదని అన్నారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో పండించిన అన్ని రకాల వడ్లకు  ప్రతి క్వింటాకు రూ.500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందేనని కోరారు లేనియెడల మా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్, పార్టీ డివిజన్ నాయకులు ఎస్ కే సయ్యద్, పిడమర్తి లింగన్న, బిక్షం, పాల్గొన్నారు.
Spread the love