Wednesday, June 3, 2026
E-PAPER
Homeఖమ్మంబాలికల వసతి గృహంలో 'కొండచిలువ' కలకలం

బాలికల వసతి గృహంలో ‘కొండచిలువ’ కలకలం

- Advertisement -

– అజగరమును పట్టుకున్న రిటైర్డ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 
నవతెలంగాణ-సత్తుపల్లి : సత్తుపల్లిలోని జేవీఆర్ డిగ్రీ కళాశాల వెనుక ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహంలో బుధవారం ఉదయం ఓ కొండచిలువ (అజగరము/పైథాన్) కలకలం రేపింది. హాస్టల్లోకి ప్రవేశించిన కొండచిలువను గుర్తించిన అక్కడివారు సమాచారాన్ని అటవీ అధికారులకు చేరవేశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అదే శాఖలో బీట్ ఆఫీసరుగా పనిచేస్తూ రిటైర్డ్ అయిన ప్రముఖ స్నేక్ క్యాచర్ మొహమూద్ పిలిపించారు.మొహమూద్ వెంటనే బాలికల వసతి గృహానికి చేరుకొని కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. 12 అడుగుల పొడవున్న ఈ కొండచిలువను పట్టుకుంటున్న క్రమంలో స్నేక్ క్యాచర్ మొహమూద్ మెడను చుట్టేసి మల విసర్జన చేసింది. పట్టుకున్న కొండచిలువను మొహమూద్ అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వసతి గృహంలోని అప్పటివరకు ఆందోళనకు గురైన బాలికలు అటవీశాఖ వారు వచ్చి కొండచిలువను పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు స్నేక్ కేచర్ మహమూద్ సుమారుగా 60 వరకు వివిధ రకాల పాములు కొండచిలువలను పట్టుకున్నారు. సత్తుపల్లి ప్రాంతంలో ఎక్కడికి పాములు వచ్చిన వెంటనే మహమ్మద్ కు సమాచారం అందిస్తారు. దీంతో ఆయన అక్కడికి చేరుకొని ఆ పాములను పట్టుకోవడం గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -