Thursday, June 25, 2026
E-PAPER
Homeక్రైమ్నీటి సంపులో పడి చిన్నారి మృతి

నీటి సంపులో పడి చిన్నారి మృతి

- Advertisement -


​తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన నాయనమ్మ
నవతెలంగాణ-జనగామ

జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లో బుధవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో కొద్దిగంటల వ్యవధిలో రెండేండ్ల చిన్నారి, ఆమె నానమ్మ మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన మారబోయిన రఘు-పావని దంపతుల రెండేండ్ల చిన్నారి యాన్సీ ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవ శాత్తు నీటిసంపులో పడిపోయింది. కుటుంబ సభ్యులు గమనించేలోపే చిన్నారి నీటిలో మునిగిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా మనవరాలు మృతిచెందిన విషయం తెలుసుకున్న నానమ్మ మారబోయిన నాగమ్మ(65) తీవ్ర ఆవేదనకులోనై కన్నీరుమున్నీరుగా విలపించి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్ప కూలింది. మనవరాలు, నానమ్మ ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. చిన్నారి మృతిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

​గణపురంలో వృద్ధురాలి మృతి
భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన గోడిశాల సరోజన(75) ప్రమాదవశాత్తు బుధవారం నీటి సంపులో పడి మృతి చెందింది. వృద్ధురాలు తెల్లవారుజామున ఇంటి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో ఇంటి ముందు ఉన్న నీటి సంపులో ప్రమాదవశాత్తు జారిపడి మునిగి మృతి చెందింది. మృతురాలి కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -