నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కర్ణాటకలో పర్యటించనున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కర్నాటకలోని విజయనగర జిల్లా హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి నూతనంగా ఏర్పాటు చేసిన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. కర్నాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు సీఎం ఈ పర్యటనకు వెళ్తున్నట్టుగా గా సమాచారం. ఇదే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరుకానున్నట్టు తెలిసింది. తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ ఏడాది క్రితం కొట్టుకుపోయింది. దాంతో కర్నాటక ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మొత్తం 33 స్పిల్‌వే గేట్లను అమర్చింది. తుంగభద్ర బోర్డు పరిధిలో తెలంగాణ, కర్నాటక, ఏపీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లనున్నారు. ఈ పర్యటన అంతర్రాష్ట్ర జల సంబంధాల బలోపేతానికి, ఆర్డీఎస్ వంటి పెండింగ్ ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి వేదికగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.
నేడు కర్నాటకకు సీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



