Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలునీటి సంపులో పడి చిన్నారి మృతి

నీటి సంపులో పడి చిన్నారి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బొల్లారం గ్రామానికి చెందిన లింగస్వామి, మల్లేశ్వరి దంపతులకు కూతురు లాస్య శ్రీ (3) ఉంది. మల్లేశ్వరి పనుల నిమిత్తం ఉదయం వనపర్తికి వెళ్లింది. చిన్నారిని ఇంట్లోనే వదిలి మల్లేశ్వరిని తీసుకువచ్చేందుకు లింగస్వామి బైక్ పై వెళ్లాడు. ఈ క్రమంలో చిన్నారి లాస్య శ్రీ ఆడుకుంటూ ఇంట్లోని సంపులో పడి మృతి చెందినట్లు తెలిపారు. కూతురు మృతితో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -