– గర్భిణులకు మనోధైర్యమివ్వాలి
– సహజ ప్రసవాలను ప్రోత్సహించాలి : డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ప్రసవాలను మహిళలకు మధు రానుభూతిని మిగిల్చేవిగా మార్చాలని ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్‌హెచ్ ఈఆర్‌ఎఫ్) మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్ పిలుపు నిచ్చారు. ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్‌హెచ్ ఈఆర్‌ఎఫ్), యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ సంయుక్తాధ్వర్యం లో బెటర్ బర్తింగ్ ఎక్స్‌పీరియ న్స్ మూడు రోజుల సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో గైనకాలజీ విభాగం హెడ్ డాక్టర్ పల్లవి, మిడ్‌వైవ్స్ హెడ్ ఇందర్‌జీత్‌ల తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ అవాంఛనీయ సి సెక్షన్‌లను తగ్గించడం, గర్భధారణ సమయంలో సహజ ప్రసవాలు, నొప్పుల విషయంలో మహిళకు భయా న్ని పోగొట్టడం, ఆమెను గౌరవనీ యంగా 9 నెలల పాటు సహజ ప్రసవానికి సిద్ధం చేసే పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకో వాలని ఆమె కోరారు. సహజ ప్రసవా లు పెరగాలంటే అందుకు సరైన జ్ఞానం, సహకారం మహిళలకు అవస రమన్నారు. సహజ ప్రసవాలకు చాలా సాధారణ పద్ధతులు కొన్ని తెలిస్తే సరిపోతుందని తెలిపారు. తమ దగ్గరి కి వచ్చే అన్ని రకాల ఆరోగ్య పరిస్థితు లు కలిగిన మహిళలకు సహజ ప్రసవాలు చేసేందుకే ప్రయత్నిస్తామని చెప్పారు. కేంద్రంలో మిడ్‌వైవ్స్ బిల్లు ఆమోదం పొందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. దాని ద్వారా మిడ్‌వైవ్స్ ప్రపంచస్థాయి ప్రమాణాలపై శిక్షణ పొందే అవకాశం లభిస్తుందని తెలి పారు. రాష్ట్రంలో తాము 353 మంది మిడ్ వైవ్స్‌కు శిక్షణ ఇచ్చామనీ, తాము శిక్షణ ఇచ్చిన ప్రాంతాల్లో సహజ ప్రసవాలు పెరిగినట్టు ఆమె వెల్లడిం చారు. డాక్టర్ పల్లవి మాట్లాడుతూ గర్భధారణ అనేది జబ్బు కాదనీ, భయ పడాల్సిన అంశం కాదని తెలిపారు. మహిళలకు అదో మంచి అనుభవంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలి పారు. గర్భస్థ సమయంలో నొప్పి నిర్వ హణకు అవసరమైన అన్ని పద్ధతుల పై సదస్సులో డాక్టర్లు, నర్సులు తదితరులకు శిక్షణ ఉంటుం దని తెలిపారు. ఇది దేశంలోనే తొలి సారిగా నిర్వహిస్తున్న సదస్సు అనీ, ఇందులో పేరెంటల్ మెంటల్ హెల్త్ కూడా ఒక అంశంగా ఉందని చెప్పారు.