”మాట్లాడితే మనసు తేలిక… మౌనంగా ఉంటే మస్తిష్కం భారంగా!”.. ఇది ఒక సామెత మాత్రమే కాదు. ఇప్పటి మహిళల జీవితానికి అద్దం పట్టే వాస్తవం. వేగంగా మారుతున్న జీవనశైలి, బాధ్యతలు, ఒత్తిడులు మధ్య మహిళలు తమ భావాలను పంచుకునే అలవాటు మెల్లగా తగ్గిపోతోంది. ఈ చిన్న మార్పు, పెద్ద మానసిక ప్రభావాలను చూపుతోంది.
చిట్ చాట్ వెనుక సైకాలజీ : సైకాలజీ ప్రకారం మనిషి ఒక social being. సంభాషణలు, నవ్వులు, అనుభవాల పంచుకోవడం…
all these are emotional needs. మనం చిట్ చాట్ చేస్తే మెదడులో feel-good hormones అవర విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. అందుకే, కొద్దిసేపు మనసు విప్పి మాట్లాడితే ఒకరోజు మొత్తం తేలికగా అనిపిస్తుంది.
అప్పుడు అరుగులపై.. ఇప్పుడు మొబైల్ : స్క్రీన్‌పై ఒకప్పుడు సాయంత్రం అయ్యిందంటే వీధి అరుగులపై కూర్చొని మహిళలు కలిసి మాట్లాడుకునేవారు. పక్కింటి వాళ్లు, స్నేహితులు… ఎవరైనా చేరి, చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద సమస్యల వరకు పంచుకునేవారు. ఆ సంభాషణల్లో నవ్వులు ఉండేవి, అనుభవాలు ఉండేవి, సమస్యలకు పరిష్కారాలు కూడా దొరికేవి. అది ఒక సహజమైన group therapy లాంటిది. ఇప్పుడు అదే సాయంత్రం.. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్. ఒకరితో ఒకరు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడే సమయం తగ్గి, స్క్రీన్‌తోనే గడిపే జీవితం పెరిగింది. సంబంధాలు దగ్గరగా ఉన్నా సంభాషణలు దూరమయ్యాయా? అనే ఆలోచన కలుగుతోంది.
అప్పట్లో షాపింగ్.. ఇప్పుడు స్క్రీన్ టాపింగ్! ఒకప్పుడు కలిసి షాపింగ్‌కు వెళ్లడం ఒక చిన్న పండుగలా ఉండేది. బజార్లో తిరుగుతూ, ఒకరికి ఒకరు డ్రెస్సులు చూపిస్తూ చిట్ చాట్ చేస్తూ గడిపే సమయం… అది bonding ప్రతీక. ఇప్పుడు Add to Cart — Buy Now తో షాపింగ్ పూర్తవుతోంది. సౌకర్యం పెరిగింది కానీ ఆ నవ్వులు, ఆ అనుబంధం మెల్లగా తగ్గిపోయాయి.
మౌనం పెరిగితే సమస్యలు కూడా పెరుగుతాయి. ఇప్పటి మహిళలు బిజీగా ఉన్నా, meaningful conversations మాత్రం తగ్గిపోయాయి. దీంతో ఒంటరితనం, శీఙవత్‌ీష్ట్రఱఅసఱఅస్త్ర, చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడటం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. మాట్లాడకపోవడం కూడా ఒక మానసిక ఒత్తిడికి కారణమవుతోంది.
ఒక చిన్న సూచన.. పెద్ద మార్పు
ఇటీవల కౌన్సెలింగ్‌కు వచ్చిన ఒక మహిళలో ఒంటరితనం, నిరుత్సాహం కనిపించాయి. రోజూ కొద్దిసేపైనా స్నేహితులతో చిట్ చాట్ చేయమని సూచించాం. నెల రోజుల్లోనే ఆమె జీవితంలో స్పష్టమైన మార్పు వచ్చింది. ముఖంలో చిరునవ్వు, మాటల్లో ఉత్సాహం, జీవితం మీద కొత్త ఆశ. ఇలా చిన్న సంభాషణలు.. పెద్ద మార్పులు తీసుకురాగలవు!
అన్ని చిట్ చాట్‌లు మంచివి కావు!
గాసిప్స్, పోలికలు, నెగటివ్ చర్చలు మనసును మరింత అలసటకు గురి చేస్తాయి. అందుకే సానుకూలంగా, ప్రోత్సాహంగా ఉండే చిట్ చాట్‌నే అలవాటు చేసుకోవాలి.
చిట్ చాట్.. ఒక చిన్న థెరపీ. మనసు ఖాళీగా ఉంటే అది ఆలోచనలతో నిండిపోతుంది. కానీ మనం మాట్లాడితే, మన భావాలు బయటకు వచ్చి మనసు తేలిక అవుతుంది. చిట్ చాట్ R Natural Therapy (No cost, No side effects!) టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేసింది. కానీ మనుషుల మధ్య ఉన్న అనుబంధాలను తగ్గించకూడదు. అరుగులపై కూర్చొని మాట్లాడిన రోజులు తిరిగి రాకపోయినా మనసు విప్పి మాట్లాడే అలవాటు తిరిగి తెచ్చుకోవచ్చు.
”మాటల్లోనే మాయ ఉంది.. మనసు పంచుకుంటే జీవితం నిజంగా హాయిగా మారుతుంది!”
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



