రూ.30,000 ఆర్ధిక సహాయం చేసిన చౌటుప్పల్ కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పట్టణం లక్కారం కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ అమీర్ గాయపడ్డా ఎర్ర నరసింహ కుటుంబానికి అండగా నిలిచి రూ.30,000 రూపాయాలు ఆర్ధిక సహాయం అందజేశారు.శ నివారం లక్కారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన షేక్ అమీర్ కుటుంబానికి రూ.25,000 గాయపడ్డఎర్ర నరసింహ కు వైద్య ఖర్చుల కొరకు రూ.5,000ల చొప్పున కుటుంబ సభ్యులకు నగదును అందజేశారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలకు ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కాసర్ల  శ్రీనివాస్ రెడ్డి 8వ వార్డు అధ్యక్షులు పాశం శ్రీనివాస్ సీనియర్ నాయకులు కాసర్ల నర్సిరెడ్డి,ఆకుల యాదిరెడ్డి,ఎర్ర వీరయ్య,రేఖ మల్లేష్,ఎర్ర శంకర్,పెద్ద ఎర్ర శంకర్,బద్రి గాలయ్య,బద్రి బాలరాజు,ఎర్ర విజయ్,ఎర్ర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love