మండలంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలో  కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట మహిపాల్ ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహం దగ్గర కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జెడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి,హాజరై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు మన కేసీఆర్ అని కొనియాడారు. పేదల బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ రైతులకు అభివృద్ధి  పథకాలను ఎన్నో ప్రవేశపెట్టిన మన ప్రియతమ నేత కేసీఆర్ అని ఆసరా పెన్షన్, కళ్యాణ్ లక్ష్మి,  షాది ముబారక్ వంటి పథకాలను పేద ప్రజల కొరకు అందించిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పల్లె సంజీవరెడ్డి,గద్దపాక సహకార సంఘం చైర్మన్ గుర్రాల తిరుపతిరెడ్డి ,వివిధ గ్రామాల ,సర్పంచులు, ఎంపీటీసీలు గాండ్ల తిరుపతి,  కీసర సంపత్,కాటం వెంకట రమణారెడ్డి,గజ్వేల్లి హనుమంతు,గుర్రం రామస్వామి, తిరుపతి,మోలుగూరి శ్రీనివాస్, సతీష్ రెడ్డి, రైతు సమితి సభ్యులు కొత్తపల్లి రవి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love