మృతుని కుటుంబానికి చేయూతనిచ్చిన మాజీ సర్పంచ్

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిదిలోని కాచాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్, ఓ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.కాచాపూర్ గ్రామంలో ఇటీవల మాతంగి ఓదయ్య (65) గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెదడంతో, బాధిత కుటుంబాన్ని గురువారం పరామర్శించి,మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, బాధిత కుటుంబానికి కుటుంబానికి ఆర్థిక సాయంగా 5 వేల రూపాయల నగదును,25 కేజీల బియ్యాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా తిరుపతి గౌడ్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగంపల్లి మల్లారెడ్డి,గ్రామ సోషల్ మీడియా ఇంచార్జ్ మారుముల్ల శ్రీనివాస్,కనుకుంట్ల సంపత్,శనిగరపు ఓదయ్య,బాధిత కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.
Spread the love