16న జరిగే దేశ వ్యాప్త కార్మిక, కర్షక, గ్రామీణ బందును విజయవంతం చేయాలి: సీఐటీయూ

– కంటేశ్వర్ బైపాస్ తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు వర్కర్స్  ప్రాంతంలో  కరపత్రాలు పంచుతూ సంతకాల సేకరణ చేయిస్తున్న 
సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంటేశ్వర్
2024 ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త కార్మిక కర్షక గ్రామీణ బందును విజయవంతం చేయాలని సీఐటీయూ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కంటేశ్వర్ బైపాస్ వద్దా తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ప్రాంతంలో కరపత్రాలు పంచుతూ సంతకాల సేకరణ చేయిస్తూ, ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. గతంలో ప్రాణాంతకమైన ప్రమాదానికి ఐపిసిలో సెక్షన్ 304(ఎ) ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉండేవి. కానీ కొత్త చట్టంలో సెక్షన్ 106 (1) & (2)గా మార్చబడిన బిఎన్ఎస్ సెక్షన్ 106(1) ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల మనిషి చనిపోతే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా, సెక్షన్ 106(2) ప్రకారం ఎవరైనా అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల చనిపోయి, డ్రైవర్లు పోలీసులకు లేదా మేజిస్ట్రేట్ (హిట్ అండ్ రన్)కి నివేదించకుండా అక్కడి నుండి తప్పించుకుంటే, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుందని చట్టంలో పేర్కొంది. సాధారణంగా ప్రభుత్వం కొత్త చట్టం లేదా ప్రస్తుత చట్టానికి సవరణ చేసే ముందు బీజేపీ ప్రభుత్వం సంబంధిత సంస్థలతో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయం. ప్రమాదాలను తగ్గించేందుకు మోటార్ వాహన చట్టాన్ని సవరణలు చేస్తున్నామనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎం.వి. యాక్ట్-2019ని తీసుకువచ్చింది. చిన్న చిన్న పొరపాట్లకు కూడా వేలాది రూపాయలను జరిమానాలు వసూలు చేస్తూ డ్రైవర్లకు జైలు శిక్షలు కూడా అమలు చేసేందుకు ఆ చట్టం తీసుకొచ్చాం. మొత్తం రవాణా రంగంలోని చిన్న యజమానులు, ఓనర్ కమ్ డ్రైవర్లుగా ఉన్నవారు జీవించే పరిస్థితి లేకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్నది. పర్మిట్ ఇవ్వడం, ఫైనాన్స్, 15 సంవత్సరాలు దాటిన వాహనాల స్క్రాప్, ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుదల, టోల్ చార్జీల పెంపు వంటివి ఈ చట్టం ద్వారా అమలు చేస్తున్నారు. ఒకపక్క కార్పొరేట్ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయాల వల్ల గతంలో ఆటోలలో ప్రయాణించే వారి సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఫలితంగా ఆటో డ్రైవర్లకు పూట గడవడం కష్టంగా మారింది. విద్యాధికులై ఉండి ఉద్యోగం దొరక్క స్వయం ఉపాధి క్రింద ఆటో డ్రైవర్లుగా పని చేసుకుంటున్న వారు ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని భరించలేక ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకని మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గీత, నేత, బీడీ కార్మికులకిస్తున్న తరహాలో నెలకు రూ.4,500/-లు జీవనభృతి ఇవ్వాలని కోరుతున్నాము.ఇంకా, రోడ్డు రవాణా కార్మికులు, డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. నైపుణ్యం ఉన్న వారి వృత్తి పట్ల వారికి గౌరవం లేదు. వారు ఎటువంటి కార్మిక చట్టం క్రింద మరియు ఉద్యోగ భద్రత మరియు సామాజిక భద్రత లేదు. ప్రభుత్వం కొత్త వాహనాల కొనుగోలుకు లేదా ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి ఆర్ధిక సహాయాన్ని (రుణాలు) అందించడం లేదు. కావున బిజెపి ప్రభుత్వ విధానాలను వెనక్కి తీసుకోనంత వరకు పరిశ్రమ మనుగడ సాగించదు, కార్మికుల హక్కులు రక్షించబడవు. ఈ క్లిష్ట పరిస్థితులు మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డు రవాణా కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని తెలంగాణ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
 హిట్ & రన్ (బిఎన్ఎన్) 106 (1) (2) సెక్షన్ను రద్దు చేయాలి.ఎం.వి. యాక్ట్ 2019 సవరణ చట్టం రాష్ట్రంలో అమలు చెయ్యొద్దు. సవరణను ఉపసంహరించుకునే విధంగా కేంద్రం మీద ఒత్తిడి చేయాలి.ప్రభుత్వమే ఆన్లైన్ యాప్ ఏర్పాటు చేసి తక్కువ కమిషన్ తో కార్మికులకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలి. కేరళ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా, ప్రభుత్వం మీద ఆర్థిక భారం లేకుండానే చేయవచ్చు.రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో, క్యాబ్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్, బస్సు తదితర అన్నిరకాల ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ శ్రీ కార్మికులకు వర్తింపజేయాలి. ప్రభుత్వం మీద పెద్దగా భారం పడకుండానే చేయవచ్చు. 4 లేబర్ కోడ్స్ మరియు విద్యుత్ సవరణ బిల్లు- 2022ను రద్దు చేయాలి. నేషనల్ మానిటైజేషన్ ఫైడ్లైన్ పాలసీని రద్దు చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేని అసంఘటితరంగ కార్మికులకు రూ.7,500/-లు నెలకు జీవన భృతి చెల్లించాలి. ధరల పెరుగుదలను అరికట్టాలి. ఆహార వస్తువులు మరియు నిత్యావసరాలపై జిఎన్ టిని ఉపసంహరించాలి. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంట గ్యాన్పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలి. మహిళలకు ఉచిత ఫ్రీ బన్ ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు గీత, నేత, బీడీ కార్మికులకు ఇస్తున్నట్లుగా వీరికి జీవన భృతి నెలకు రూ.4,500/-లు ఇవ్వాలి. 3 నెలల పాటు ఆటోల మీద ఈఎంఐపై మారిటోరియం ప్రకటించాలి. ఆటో డ్రైవర్ల ఇన్సూరెన్స్. ఫిట్నెస్ ప్రభుత్వమే భరించాలి.ఈ కార్యక్రమంలో సుధాకర్ ఎస్.కె హైమద్ ఎస్ కే జావీద్, నవీన్ దశరథ్ మోహన్ హైమద్ పాషా చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Spread the love