– యత్నాలను భగం చేసిన భారత యుద్ధనౌక
న్యూఢిల్లీ : గత డిసెంబరులో హైజాక్ చేసిన ఓడ రూయిన్ను ఉపయోగించి సోమాలీ సముద్రపు దొంగలు చేస్తున్న దాడుల యత్నాలను భారత నావికాదళానికి చెందిన యుద్ధ నౌక భగం చేసింది. సోమాలియా తూర్పు తీరంలో నట్టనడి సముద్రంలో ఓడలను హైజాక్ చేసేందుకు పాల్పడుతున్న సముద్రపు దొంగల గ్రూపు యత్నాలను ఓడించామని తెలిపింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తాము తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించిన వారు భారత యుద్ధనౌకపై కాల్పులు జరిపారని నేవీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. వెంటనే ఆత్మరక్షణార్ధం తాము కూడా ఎదురు చర్యలు తీసుకుని వారిని లొంగదీశామని తెలిపింది. నౌకలోని సముద్రపు దొంగలను వెంటనే లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. డిసెంబరు 14న మాల్టా పతాకంతో వున్న ట్యాంకర్ నుండి కాపాడాల్సిందిగా ఎస్ఓఎస్ సందేశం భారత నేవీకి అందింది. దాంట్లో 18మంది సిబ్బంది కూడా వున్నారు. ఆ తర్వాత నుండి ఆ నౌకను సముద్రపు దొంగలు తమ చౌర్య కార్యకలాపాలకు వాడుతున్నట్లు తెలుస్తోందని నేవీ తెలిపింది.