
వర్షాకాలం సందర్భంగా ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని బైంసా ఎంపీడీవో సుధాకర్ రెడ్డి సూచించారు. శుక్రవారం పారిశుద్ధ దినోత్సవం సందర్భంగా హజ్గుల్ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం గ్రామంలో రోడ్లను మురికి కాలువలను పరిశీలించారు. చెత్తను వెనివెంటనే తీసేయాలని, పారిశుద్ధ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట హెల్త్ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు ఉన్నారు.