వాట్సాప్ లో ఆ లింక్ పై క్లిక్ చెయ్యొద్ధు..

నవతెలంగాణ – హైదరాబాద్: ‘పీఎం కిసాన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్’ అంటూ వాట్సాప్ గ్రూప్‌ల్లో ఓ APK ఫైల్ చక్కర్లు కొడుతోంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో ఈ లింక్ క్లిక్ చేసిన 10 మంది వాట్సాప్ హ్యాక్ అయింది. వారి అకౌంట్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయి. పీఎం కిసాన్ యాప్ లింక్‌ను క్లిక్, ఫార్వార్డ్ చేయొద్దని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు తెలిపారు.

 

Spread the love