సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ స్థల పరిశీలన

సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ స్థల పరిశీలననవతెలంగాణ-మరిపెడ
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డోర్నకల్‌ నియోజకవర్గ స్థాయి ప్రజా ఆశీర్వాదసభ ఈనెల 21న మరిపెడలో నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపూడి నవీన్‌ రావు తెలిపారు. గురువారం మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయ స్టేట్‌ ఏరియాలో బహిరంగ సభ ప్రాంగణం,హెలికాప్టర్‌ స్థలం, వాహనాలు పార్కింగ్‌, ప్రజలు కూర్చున్నందుకు తగిన ఏర్పాట్లను తొర్రూరు డీఎస్పి వెంకటేశ్వర్లు బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపూడి నవీన్‌ రావు, సీఐ ఎల్‌ రాజు, ఎస్సై పవన్‌ కుమార్‌లతో కలిసి సమీక్షించారు. లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు అధికార పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మాజీ ఒడిసిఎంఎస్‌ చైర్మన్‌ కుడితి మహేందర్‌ రెడ్డి, జడ్పిటిసి తేజావత్‌ శారద రవీందర్‌ నాయక్‌, మాజీ సర్పంచ్‌ పానుగోతు రామ్‌ లాల్‌, మండల పార్టీ అధ్యక్షులు రామ సహాయం సత్యనారాయణ రెడ్డి, బిఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు, కో ఆప్షన్‌ సభ్యులు ఉప్పల నాగేశ్వరరావు, 5వ వార్డు కౌన్సిలర్‌ పానుగోత్‌ సుజాత వెంకన్న , 11వ వార్డు కౌన్సిలర్‌ ఎడెల్లి పరశురాములు, తదితరులు ఉన్నారు.

Spread the love