సీఎం రేవంత్ రెడ్డి మతి భ్రమించింది.. 

– బీఆర్ఎస్  బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ గౌడ్ 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

 తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి  మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ గౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు. సీఎం సీటును కాపాడుకోవడం కోసమే అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. తను సీఎం అయినా కొద్ది రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్నారు. పార్టీలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం తన స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నాడని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూస్తుందని గ్రహించి వీధి రౌడీలా కేసీఆర్ ని తొక్కి పడేస్తాం రండా అని దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత  కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మారుస్తుందని గాంధీభవన్ లో చర్చ జరుగుతుందన్నారు. గత పది సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి ఆటంకాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసిన ఘనత కెసిఆర్  ప్రభుత్వానిదేనని అన్నారు. రెండు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి రోజుకు మూడు నాలుగు గంటలకు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు.
Spread the love