Wednesday, April 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

- Advertisement -

రూ.17 లక్షల భూగర్భ డ్రైనేజీ మంజూరుతో కాంగ్రెస్ శ్రేణుల ఆనందోత్సాహం
నవతెలంగాణ – నాచారం

నాచారం సర్కిల్ ఉమ్మడి మల్లాపూర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మల్లికార్జున్ నగర్ కాలనీ రోడ్ నెంబర్–1లో రూ.17 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు మంజూరు కావడంతో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందమూల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో ఈ పనులు మంజూరయ్యాయని నాయకులు తెలిపారు. మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్, సీనియర్ నాయకులు నెమలి అనిల్, దంతురి రాజు గౌడ్, పీజీ సుదర్శన్, జమ్మిలా బేగం, ముజీబ్, ఎస్‌వీ కిట్టు, కోయగూర బాలరాజ్, జానీ భాయ్, ప్రభాకర్ రెడ్డి, పర్వతాలు, బెల్లం శ్రీను, మధుసూదన్ రెడ్డి, టిల్లు ముదిరాజ్, మనోహర్, శ్రీనివాస్, అన్వర్, ఉపేందర్, ఫిరోజ్, శైలజ, ఇంతియాజ్, సోనీ, ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -