
మండల స్థాయి సీఎం కప్ పోటీలు జడ్పీహెచ్ఎస్ జన్నారం బాలుర పాఠశాల అందు నిర్వహించడం ఎం ఈ ఓ విజయ్ కుమార్, ఎంపీడీవో శశికళ ఎమ్మార్వో రాజ మనోహర్ రెడ్డి తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు జిల్లాల్లో జరగబోయే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో పాల్గొనే అవకాశం దక్కిందన్నారు. కబడ్డీ,కోకో , వాలీబాల్,రన్నింగ్, ఇతర అథ్లెటిక్స్ లో పోటీలు నిర్వహించామన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైనటువంటి విద్యార్థులకు నూడల్స్ తో సన్మానించడం చేయడం జరిగిందన్నారు.. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ శివరాజన్, కిష్టాపూర్ ఉపాధ్యాయులు ప్రకాష్ బానావత్ ,ఫిజికల్ డైరెక్టర్లు యాకూబ్, సాగర్, కాంతయ్య, చరిష్మా., ఇతర పిఈటిలు వివిధ పాఠశాలల నుండి పీటీలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.