రేర్ ఎర్త్ ఖనిజాల కోసం
ప్రయత్నం కొనసాగించాలి
సింగరేణి అధికారులకు భట్టి దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎల్‌నినో ప్రభావం వల్ల విద్యుత్ అవసరాలు పెరిగిన నేపథ్యంలో డిమాండ్ కు తగ్గట్టుగా సింగరేణి బొగ్గు ఉత్పత్తిని పెంచాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్ లో సింగరేణి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన భద్రత విషయంలో సింగరేణి తన పాత్రను మరింత గా పోషించాలని అన్నారు. లాభదాయక సంస్థగా సింగరేణిని నిలబెట్టేందుకు బొగ్గు తవ్వకాలతో పాటు కీలక, ప్యూహాత్మక ఖనిజాల అన్వేషణ చేయాలని అధికారులకు సూచించారు. క్రిటికల్ మినరల్స్, బొగ్గు గనులకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే అన్ని వేలం ప్రక్రియల్లో పాల్గొనాలన్నారు. అంతర్జాతీయ అవకాశాలను అధ్యయనం చేసేందుకు సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, చిలీ వంటి దేశాల కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్లను నియమించామని భట్టి చెప్పారు. సమావేశంలో సింగరేణి సీఎండీ బుద్దప్రకాష్ జ్యోతి, డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
డిమాండ్‌కు తగ్గట్టుగా బొగ్గు ఉత్పత్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



