కాగ్నిజెంట్‌, గూగుల్‌ క్లౌడ్‌ భాగస్వామ్య విస్తరణ

న్యూఢిల్లీ : ఎంటర్‌ప్రైజ్‌ క్లయింట్లకు ఎఐ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు తమ భాగస్వామాన్ని విస్తరించామని కాగ్నిజెంట్‌, గూగుల్‌ క్లౌడ్‌ కంపెనీలు ప్రకటించాయి. బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు సిద్ధాంతంపై పని చేస్తున్న సంస్థలకు వినూత్న పరిష్కారాలను అందించేందుకు తాము దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నామని పేర్కొన్నాయి. ఇందుకోసం కాగ్నిజెంట్‌ బెంగుళూరులో, లండన్‌, శాన్‌ ఫ్రాన్సిస్కోలలో కొత్త గూగుల్‌ క్లౌడ్‌ ఎఐ ఇన్నోవేషన్‌ సెంటర్‌లను ప్రారంభించినట్లు తెలిపాయి. నూతన కాగ్నిజెంట్‌ గూగుల్‌ క్లౌడ్‌ ఎఐ విశ్వవిద్యాలయం 25,000 మంది కాగ్నిజెంట్‌ నిపుణులకు, క్లయింట్‌లకు శిక్షణనిస్తుందని వెల్లడించాయి.

Spread the love