గిరిజన సాంప్రదాయ పద్ధతిలో శీతల పండగ

నవతెలంగాణ- రామారెడ్డి
గిరిజన సంప్రదాయ పద్ధతిలో మంగళవారం మండలంలోని గోకుల్తాండాలో శీతల పండుగను నిర్వహించారు. గిరిజన ఆరాధ్య దైవాలకు నైవేద్యం సమర్పించి, పిల్లా పాపాలు, పాడిపంట, పశువులు చల్లగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలితా లింబాద్రి నాయక్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love