ఈనెల 6 7 తేదీలలో జిల్లాలోని ఎటునాగారంలో నిర్వహించే సీపీఐ(ఎం) జిల్లా మహాసభల నిర్వహణకు విరాళాలు సేకరిస్తున్నట్టు మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మండలంలోని పసర గ్రామంలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. సభల నిర్వహణ ఖర్చులకు గాను ప్రతి మండలం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, కూలీలు, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్, గుత్తేదారుల నుండి సభ నిర్వహణ ఖర్చులకు గాను విరాళాలను సేకరిస్తున్నామని తెలిపారు. విరాళాల సేకరణలో వారి వారి స్తోమతను బట్టి విరాళాలు అందజేస్తున్నారని, విరాళాల సేకరణలో ప్రజల నుండి వస్తున్న స్పందన అద్భుతంగా ఉందని అన్నారు. ఉన్నదానిలో తమ వంతు సహాయంగా అందిస్తున్నామని, ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్నది సీపీఐ(ఎం) మాత్రమేనని అంటూ, కమ్యూనిజం ద్వారానే సమన్యాయం జరుగుతుందని అంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు జిల్లా నాయకులు గొంది రాజేష్ రైతు సంఘం నాయకులు రామచంద్రారెడ్డి, సుందరయ్య నగర్ కాలనీ నాయకుడు అంజద్ తదితరులు పాల్గొన్నారు.