నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట మునిసిపాలిటీ పరిధిలో చేపడుతున్న నక్ష కార్యక్రమం అమలును వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్ధన్నపేట మునిసిపల్ పరిధి లోని 6 వార్డు లో పలు గృహాలను, వ్యవసాయ భూములలో జరుగుతున్న నక్ష క్షేత్ర స్థాయి లో జరుగుచున్న పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారదా మాట్లాడుతూ భూ రికార్డుల నిర్వహణలో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నక్ష కార్యక్రమం ద్వారా భూ వివరాల నమోదు సక్రమంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నక్ష కార్యక్రమం ద్వారా భూ వివరాల నమోదు సక్రమంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, ఏడి సర్వే ల్యాండ్ శ్రీనివాస్ రావు,వరంగల్ ఆర్డీవో సుమ , వద్దన్నపేట మున్సిపల్ కమిషనర్ జోన,సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



