గ్రామాలలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి: కలెక్టర్ వెంకట్ రావు

నవతెలంగాణ – చివ్వేంల
గ్రామాలలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని  సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రావు అన్నారు. శనివారం   ఆకస్మికంగా చివ్వేంల గ్రామాన్ని సందర్శించి, పారిశుద్ధ్య పనులను, మహాలక్ష్మి పథకం వర్తింపునకు గ్యాస్ కంపెనీ పేరు, గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్లు తప్పులు పడిన వారి వివరాలు సరి చేయు సర్వే కార్యక్రమమును పరిశీలించి మాట్లాడారు. రోజు సాయంత్రం లోగా ఇట్టి సర్వే 100% పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాలలో ఏ రకమైన త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, స్వచ్ఛమైన త్రాగునీటిని ప్రజలకు అందించాలని ఆదేశించారు. ఈ వారం రోజులలో అన్ని గ్రామాలు స్వచ్ఛ గ్రామాలగా మార్చే స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వారి వెంట ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీవో గోపి,ఆర్ ఐ వెంకట రెడ్డి, టిఎ విజయ్ కుమార్,కార్యదర్శి రజిని, గ్రామస్తులు  ఖమ్మంపాటి రాము, కృష్ణ, బిక్షం, గ్రామ పంచాయతీ  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love