నవతెలంగాణ-బెజ్జంకి : మండల పరిధిలోని తోటపల్లి,వీరాపూర్,బెజ్జంకి క్రాసింగ్,తిమ్మాయిపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన జిల్లా గ్రంథాలయం,వ్యాయామ వేదిక,నూతన గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం ప్రారంభోత్సవం చేశారు.అనంతరం అయా గ్రామాల్లో అంబేడ్కర్ భవనం,కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు.ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కవిత,ఏఎంసీ చైర్మన్ చంద్రకళ,అయా గ్రామాల సర్పంచులు బోయినిపల్లి నర్సింగ రావు,గన్నమనేని అనిత,టేకు తిరుపతి,కవ్వ లింగారెడ్డి,ఎంపీటీసీలు నల్లగొండ లక్ష్మి,ముక్కీస పద్మ,కొలిపాక రాజు,కొమిరే మల్లేశం,మండల బీఆర్ఎస్ నాయకులు,అయా గ్రామాల గ్రామస్తులు హజరయ్యారు.
గుండారంలో..
గుండారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ,మున్నూర్ కాపు సంఘ భవనం,మజీద్ ప్రహారీ గోడను ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కవిత,ఏఎంసీ చైర్మన్ చంద్రకళ,ఎంపీటీసీ ఎలుక లతతో కలిసి సర్పంచ్ శెట్టి లావణ్య ప్రారంభించారు.