Monday, May 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామ్రేడ్ ఇక్కిరి ధర్మన్న ఆశయాలు నేటికీ సజీవం

కామ్రేడ్ ఇక్కిరి ధర్మన్న ఆశయాలు నేటికీ సజీవం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ప్రజా ఉద్యమాలు, రైతాంగ విముక్తి పోరాటాల్లో కీలక పాత్ర పోషించిన అమరుడు కామ్రేడ్ ఇక్కిరి ధర్మన్న ఆశయాలు నేటికీ సజీవంగా ఉన్నాయని సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్. జనార్ధన్, డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్ అన్నారు. మే 18న ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో కామ్రేడ్ ఇక్కిరి ధర్మన్న 21వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడిన ధర్మన్న పోలీసు నిర్బంధాలు, అక్రమ కేసులు, చిత్రహింసలు ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయలేదని గుర్తు చేశారు. ప్రజా, రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిగా ఆయనను స్మరించుకున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని ఆరోపిస్తూ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో ప్రజలపై భారం పెరుగుతోందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఏ ఐ కే ఎం ఎస్ రాష్ట్ర అద్యక్ష,ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర సహాయ కార్యదర్శి మామిడాల భిక్షపతి,మండల వెంకన్న, మండారి డేవిడ్ కుమార్,జిల్లా గౌరవాధ్యక్షుడు మామిడాల సోమయ్య, జిల్లా అధ్యక్క్ష, ప్రధాన కార్యదర్శి కల్లెపు అడివయ్య,బేజాడి కుమార్,ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు పద్మ సుదర్శన్,గడ్డం నాగరాజు, ఇక్కిరి శ్రీనివాస్,పీ ఓ డబ్ల్యూ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి ఆర్.సీత,ఎం.సుగుణ, మందనపల్లి ఉప సర్పంచ్ పద్మ శశిరేఖ,పీ ఓ డబ్ల్యూ జిల్లా నాయకులు తమ్మడి మాధవి,పాకాల సరిత,టంగుటూరు మాజీ సర్పంచ్ కట్టా సమరసింహారెడ్డి,పార్టీ నాయకులు చిర బోయిన రాజయ్య, కొత్తపేట వీరమల్లు,ఎలగందుల సిద్దులు,కల్లెపు నర్సింహులు, మారుజోడు కుమార్, తమ్మడి అంజయ్య,మామిడాల బాల మల్లేష్,లోకొమ్మిడి గోపాల్ రెడ్డి, చిర బోయిన కొమురయ్య,ఆర్.ఉదయ్, అయిల యాకయ్య, పెండ్యాల శ్రీను,పాకాల నరేష్, నల్ల నర్సింగరావు, వడ్డేపల్లి బాలరాజు,పైస రాందాసు, తమ్మడి రమేష్,యెర్రంబెల్లి ఐలయ్య,మామిడాల ప్రవీణ్,మామిడాల మహేష్, వడ్డేపల్లి సాయి, కుర్రి మార్కండేయ, కడకంచి బీరయ్య, సత్యనారాయణ, బత్తుల రాజిరెడ్డి,బుర్ర మల్లయ్య, నమిలే స్వామి,చిర బోయిన బాలయ్య,పంజాల మురళి, భూషె శ్రీశైలం, సుంచు రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -