కామ్రేడ్ నర్సయ్య జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం

– మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎంపీ బోయినపల్లి
– నర్సయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నాయకులు
నవతెలంగాణ – రాయపర్తి
సీపీఐ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కామ్రేడ్ తాళ్లపల్లి నర్సయ్య జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం అని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని శివరామపురం (ఆర్అండ్ఆర్)గ్రామంలో కామ్రేడ్ నర్సయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిధులుగా ఎర్రబెల్లి, బోయినపల్లి విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రజా పోరాటంలో పాల్గొనే వారని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డాడని అన్నారు. మరి దశ తెలంగాణ ఉద్యమంలో గల్లి నుండి ఢిల్లీ వరకు తెలంగాణ వాదాన్ని వినిపించిన మహానుభావుడు కామ్రేడ్ నర్సయ్య అని కొనియాడారు. తుది శ్వాస విడిచే వరకు బడుగు బలహీన వర్గాల ప్రజల బాగుకోసం కృషి చేశాడని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ ఉద్యమకారుడు కర్ర రవీందర్ రెడ్డి, నర్సయ్య కుటుంబ సభ్యులు శాంతమ్మ, శోభారాణి చంద్ర ప్రకాశ్, విజయ జనార్దన్, తేజస్వి, శృతి, రవితేజ, సీపీఐ నాయకులు సుబ్బారావు, జిల్లా కార్యదర్శి మేకల రవి, సహాయ కార్యదర్శి సమ్మెర విశ్వేశ్వర్, మండల కార్యదర్శి గాజు యాకయ్య, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, సర్పంచ్ కుమారస్వామి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు  నరసింహా నాయక్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ సురేందర్ రావు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎండి నాయిమ్, గబ్బెట బాబు, నాగపురి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love