ముగిసిన ఫాదర్ కొలంబో మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్

నవతెలంగాణ- ధర్మసాగర్: ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో సెయింట్ ఆగస్తిన్స్ యూత్, ఆధ్వర్యంలో గత 12 రోజులుగా జరుగుతున్నటువంటి ఫాదర్ కొలంబో మెమోరియల్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీల విజేతగా వడ్డేపల్లి (పురిగుట్ట) టీం నిలిచింది, ద్వితీయ బహుమతి మడికొండ టీం నిలిచింది. ఈ కార్యక్రమానికి బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథులుగా కరుణాపురం గ్రామ సర్పంచ్ కలకోటి అనిల్ కుమార్, విచారణ గురువులు ఫాదర్ సుధాకర్, విద్యానికేతన్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఫాదర్ జియో పాల్గొని ప్రథమ బహుమతి 15000/- ట్రోఫీ, ద్వితీయ బహుమతి 7000/-, ట్రోఫీ లను ఇరు టీములకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్  మాట్లాడుతూ ప్రస్తుత యువత చెడు బాటలో పయనించకుండా క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అతి తక్కువ సమయంలో క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు కరుణాపురం యువతను అభినందించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆర్గనైజర్స్ సామెల్, వినయ్, హేమంత్ ,లక్కీ మరియు యూత్ సభ్యులు గుర్రపు ప్రవీణ్, అజయ్, ప్రశాంత్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love