జాతీయ కుష్టు వ్యాధిగ్రస్తుల నిర్ధారణ పై సమావేశం..

నవతెలంగాణ -డిచ్ పల్లి

డిచ్ పల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం లో మంగళవారం జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం లో భాగంగా జాతీయ కుష్టు రోగుల నిర్ధారణ కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి   రాష్ట్ర కుష్టు వ్యాధి నిర్మూలన జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు పాల్గొని మాట్లాడుతూ జాతీయ కుష్టు వ్యాధిగ్రస్తుల నిర్ధారణ కార్యక్రమాన్ని ఆశా కార్యకర్తలు ఏవిధంగా నిర్వహించారనే విషయం పై ప్రతి ఒక్క ఆశను అడిగి తెలుసుకున్నారు.కుష్టి వ్యాధి అనగా ఏమిటి ?కుష్టు వ్యాధి లక్షణాలు ఏమిటి ?అని ప్రతి ఆశాను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాగిరంగు మచ్చలు కలిగి ఉండి స్పర్శ లేకుండా ఉండి ఆ మచ్చపై చెమట రాకుండా వెంట్రుకలు మొలవ కుండా ఉన్నటువంటి మచ్చను కుష్టి వ్యాధి మచ్చగా నిర్ధారించాలని అలాంటి అనుమానస్పద కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించాలని, వైద్యాధికారిచే ౠ పరీక్షించి నిర్ధారించాలని తెలిపారు. మళ్లీ జాతీయ కుష్టు వ్యాధిగ్రస్తుల నిర్ధారణ సర్వేను మళ్లీ చేయాలని ఆదేశించారు. వీరి వెంట డి.పి.ఎం.వో వెంకటేశ్వర చారి, ఏపీఎంఓ కె. శ్రీనివాస్ రెడ్డి, బి .జోసెఫ్ , చందర్, మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ ,వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఎం ఎల్ హెచ్ పి లు పాల్గొన్నారు .
Spread the love