ఏఈఓలతో రైతుల వాగ్వాదం
నవతెలంగాణ – ఉప్పునుంతల
మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (కపాస్ కాంతి) కార్యక్రమంలో భాగంగా పత్తి రైతులకు హెచ్‌డీపీఎస్, ఐసీఎం విత్తనాల పంపిణీలో సోమవారం గందరగోళం నెలకొన్నది. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని పిరట్వాఁపల్లి గ్రామ రైతు వేదికలో విత్తనాల పంపిణీ జరుగుతుండగా, అర్హులైన రైతులకు విత్తనాలు అందడం లేదని రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు)తో వాగ్వాదానికి దిగారు. వ్యవసాయం చేయని కొందరికి విత్తనాలు కేటాయించడంతో వారు వాటిని బయట విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు. నిజమైన సాగుదారులను పక్కనపెట్టి ఇతరులకు పంపిణీ చేయడం వల్ల అర్హులైన రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకంగా, అర్హుల జాబితా ఆధారంగా విత్తనాలు పంపిణీ చేసి ప్రతి నిజమైన రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరారు.
పత్తి విత్తనాల పంపిణీలో గందరగోళం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



