హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోనల్, రీజినల్ కార్యాలయాల ఆధ్వర్యంలో జులై 6 నుంచి 10 వరకు దేశవ్యాప్తంగా ‘మిషన్ సంపూర్ణ కేవైసి-2026’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సి-కెవైసి, రీ-కెవైసి ప్రక్రియలను వంద శాతం పూర్తి చేయడం, ఖాతాదారుల్లో అవగాహన పెంచడం మరియు బ్యాంకింగ్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్‌బిఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హేమ్లత జి. పరంజపే ప్రారంభించారు. కేవైసీ అనుసరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘‘నియంత్రణ నిబంధనలను పాటిస్తూ, నిర్ణీత గడువులోగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా సురక్షితమైన బ్యాంకింగ్ సేవలను అందించడమే ఈ మిషన్ ఉద్దేశ్యం’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ ఎ.వి. రమణ మూర్తి, రీజినల్ హెడ్ గజేంద్ర సింగ్ చౌహాన్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సెంట్రల్ బ్యాంక్ లో ‘మిషన్ సంపూర్ణ కెవైసి-2026’ ప్రారంభం
- Advertisement -
- Advertisement -



