గజ్వేల్ ఏసీపీ బాలాజీకి అభినందనలు

నవతెలంగాణ – రాయపోల్
గజ్వేల్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన బాలాజీ గారిని ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేయడం జరిగిందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. సోమవారం గజ్వేల్ ఏసీపి కార్యాలయంలో ఏసీపి బాలాజీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గత 20 సంవత్సరాల క్రితం దౌల్తాబాద్ ఎస్సైగా ఉద్యోగంలో చేరి అంచలంచలుగా ఎదుగుతూ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా ఎదగడం చాలా సంతోషం అన్నారు. మునుముందు ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు, సమాజానికి సేవ చేయాలని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీఏ కులాల పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింలు,ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, సూరంపల్లి తలారి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love