ఆరు గ్యారెంటీల అమలు ధ్యేయమే కాంగ్రేస్ లక్ష్యం

– గ్యారెంటీలపై దరఖాస్తులను పారదర్శకంగా చేప్పట్టాలి..
– ప్రజలకు చేరువగా ప్రజాపాలన అందించాలి: ఎమ్మేల్యే జయవీర్ రెడ్డి
నవతెలంగాణ -పెద్దవూర
ఆరు గ్యారెంటీల అమలు ధ్యేయమే కాంగ్రెస్ లక్ష్యంగా పనిచేస్తుందని నాగార్జున సాగర్ ఎమ్మేల్యే కుందూరు జయవీర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పెద్దవూర మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం లో గ్రామపాలనా కార్యక్రమాన్ని ప్రారంభిచి మాట్లాడారు. మండలంలోని ప్రతి గ్రామ పంచాయితీలో
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన సభలను పకడ్బందీగా నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరించాని అన్నారు.ప్రజలకు చేరువగా పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని,  జనవరి 6 వరకు పనిదినాల్లో మండలం లోని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతివార్డుల్లో సభ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. మహాలక్ష్మీ, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్ ఇళ్లు మొదలైన పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు.ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. ప్రజాపాలన విజయవంతంగా అమలు చేసందుకు ప్రభుత్వానికి ప్రజలకు ఉద్యోగులు వారధులుగా పనిచేయాలని, తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్ పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీపీ చెన్ను అనురాద సుందర్ రెడ్డి, సర్పంచ్, ఎంపీడిఓ విజయకుమారి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు పగడాల నాగరాజు, జిల్లా యువ నాయకులు గడ్డంపల్లి వినయ్ రెడ్డి, పెద్దిరెడ్డి ఉపేందర్ రెడ్డి, ప్రసాద్, ఉంగరాల శ్రీనివాస్, మండల అధ్యక్షులు పబ్బుగిరి, మండలయూత్ అధ్యక్షులు కిలారీ మురళీ కృష్ణ యాదవ్, మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు చామల సువర్ణ, కార్యదర్శి ఢాకు నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటయ్య, వూరే వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love