నిరుద్యోగుల పాలిట శాపంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

Navatelangana,Telugu News,Telangana,Rangareddy,– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాడిగే శ్రీనివాస్‌
నవతెలంగాణ-కొడంగల్‌
నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్‌ ప్రభుత్వం శాపంగా మారిందని ఎన్నికల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీలిచ్చి, 8 నెలలు గడుస్తున్నా ఒక నోటిఫికేషన్‌ వేసిన పాపన్న పోలేదని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మడిగే శ్రీనివాస్‌ అన్నారు. కొడంగల్‌లోని ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగులు డీఎస్సీ పరీక్షలకు గడువు పొడిగించాలని నిరుద్యోగులు నెల రోజులుగా ఆందోళన కొనసాగిస్తుంటే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. గ్రూప్‌-2, గ్రూప్‌ -3 పరీక్షలను ఒకేసారి నిర్వహించిన ఇబ్బంది ఉండదని డీఎస్సీ గ్రూప్‌ 2 ఒకేరోజు సమయం ఉండడంతో ఏ విధంగా చదువుకోవాలని నిరుద్యోగులు అడుగుతున్నా, ప్రభుత్వం నిరుద్యోగుల మాట వినకుండా వాళ్లపై ప్రేమ ఉన్నట్టు ఎందుకు సవతితల్లి ప్రేమ చూపిస్తుందో అర్థం కావడం లేదన్నారు. నిరుద్యోగులు డీఎస్సీ, గ్రూప్‌-2 ఒకేసారి నిర్వహిస్తే చదువుకోలేమని పొడిగించాలని రెండు పరీక్షలలో సిలబస్‌ వేర్వేరు ఉంటుందని గడువు విధించాలని కోరు తున్న ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగులు ఇప్పటివరకు ఎన్నికల కోసం పనిచేసే రివిజన్‌ కూడా చేసుకోలేదని చెబు తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి ససేమీరా అనడంతో పాటు కోర్టు చిక్కులు వస్తాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులు చేస్తున్న పోరాటాలకు మద్దతు తెలిపి చాలామంది అనేక సంవత్స రాలుగా ఉద్యోగల కోసం చదువుతున్నారని అన్నారు. కానీ వారి వయసు అయిపోతుందని, అప్పుల భారం మోయలేక పోతున్నారని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎప్పుడు కనీసం రెండు నెలలు గడువు ఇస్తే , పరీక్షలు రాసుకుంటారని తెలిపారు. ఎ నిరుద్యోగులైతే ప్రభుత్వ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారో అదే నిరుద్యోగులతో గద్దెనెక్కిన ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. కొంతమంది రాజకీయ పదవులు వస్తాయని ఉద్దేశంతో నిరుద్యోగులపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Spread the love