
నవతెలంగాణ – మాక్లూర్
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీ లను వంద రోజుల్లో అమలు చేస్తామని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటురి వినయ్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గుత్పా, గుత్ప తండా గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటికొక ఉద్యోగం అని చెప్పి కేసీఆర్ ఇంటికి ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని, నిరుద్యోగ యువతకు పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు, దళిత బంధు జాడ లేదని, ఊరికి రెండు వందల దళిత కుటుంబాలు ఉంటే ఒక్కరికీ మాత్రమే దళిత బంధు ఇచ్చి దగా చేసాడని, పేర్కొన్నారు. ధరణి తొ రైతులందరిని ఇబ్బందులకు గురి చేసాడని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తామని తెలిపారు. జీవన్ రెడ్డి 100 కోట్లతొ షాపింగ్ మాల్ కట్టుకున్నాడు కాని ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టివ్వలేదని, జీవన్ రెడ్డి ని తరిమికొడితేనే మీకు ఇళ్ళు వస్తాయని తెలియజేశారు. సీనియర్ నాయకులు మార చంద్రమోహన్, యాల్ల సాయరెడ్డి లు మాట్లాడుతూ వినయ్ రెడ్డిని బలపరిచి భారీ మెజారిటీతొ గెలిపించాలని కోరారు. ఈ
కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, జిల్లా నాయకులు గంగాధర్ గౌడ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.